- సీఎం ప్రకటనపై చర్మకారుల సంఘాలు హర్షం
- దస్పల్లాలో ఘన సత్కారం
ముషీరాబాద్, వెలుగు : తెలంగాణలో లెదర్ పరిశ్రమల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంపై తెలంగాణ చర్మకారుల సంఘాల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. జేఏసీ చైర్మన్ డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ నేతృతంలో శనివారం సిటీలోని హోటల్ దస్పల్లాలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సత్కరించారు. లిడ్ క్యాప్ పునరుద్ధరించి ప్రత్యేక చైర్మన్, డైరెక్టర్లను నియమించాలని వినతిపత్రం అందజేశారు. ఆదివారం రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రెండు లెదర్ పార్కులను ప్రారంభించాలని కోరారు.
లిడ్ క్యాప్ ను పునరుద్ధరించి ప్రత్యేక చైర్మన్, డైరెక్టర్లను నియమించి 12 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లెదర్ పార్కులను ప్రారంభించి మాస్టర్ ట్రైనింగ్ చేసిన ఆర్టిజన్స్ కి మాదిగ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక అభివృద్ధి అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొలుగు రాజు, డాక్టర్ చీమ శ్రీనివాస్, వెంకటయ్య, హనుమంతు, సాయిబాబా, రాంబాబు, నరసయ్య, జాన్ దర్శనం, గుమ్మడి సతీష్, జంగా సుదర్శన్, మాస్టర్ మాల్యాద్రి పాల్గొన్నారు.