ఏడాది పాటు ఆస్తి పన్ను రద్దు చేయండి:  రేవంత్ రెడ్డి

ఏడాది పాటు ఆస్తి పన్ను రద్దు చేయండి:  రేవంత్ రెడ్డి

GHMC పరిధిలో ఏడాది పాటు పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి. దీనిపై ఇవాళ( సోమవారం) ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిశారు. లాక్ డౌన్ కారణంగా ప్రజల ఆర్థిక స్థితి దారుణంగా తయారైందని… ప్రజలు ఆదాయాన్ని కోల్పోయారని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇంటి పన్ను కట్టే స్తోమత ప్రస్తుతానికి లేదన్నారు. కాబట్టి ఏడాది పాటు ఇంటి పన్నును రద్దు చేయాలని చెప్పారు. అంతేకాదు ఉన్నత వర్గాల నుంచి పన్ను వసూలు చేస్తే అభ్యంతరం లేదన్నారు. కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి.. తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు రేవంత్ రెడ్డి.