సికింద్రాబాద్: గ్రేటర్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీ లో అసంతృప్తి నేతల తిరుగుబాటు మొదలైంది. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ప్రకటించారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న తాను సొంత వారి అసమ్మతితోనే టి ఆర్ ఎస్ కు రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తన రాజీనామా పత్రాలను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు..వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ కి రాజీనామా చేసినా కంటోన్మెంట్ ఉపాధ్యక్షుని పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు.
కంటోన్మెంట్ అభివృద్ధి పైననే నా దృష్టి పార్టీల పైన కాదు…
తన దృష్టి అంతా కంటోన్మెంట్ బోర్డుపైనే పెట్టానని.. పార్టీలపై కాదని రామకృష్ణ వివరణ ఇచ్చారు. తనకు వెన్నుదన్నుగా ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు..డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు..మంత్రి మల్లారెడ్డికి..కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కు బోర్డు మెంబర్లకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ కాలమే నిర్ణయిస్తుందన్నారు.