ఫ్యాక్టరీల్లో స్వచ్ఛమైన గాలికోసం.. ఎల్గీ నుంచి స్టెబిలైజర్ టెక్నాలజీ కంప్రెసర్లు

ఫ్యాక్టరీల్లో స్వచ్ఛమైన గాలికోసం.. ఎల్గీ నుంచి స్టెబిలైజర్ టెక్నాలజీ కంప్రెసర్లు

హైదరాబాద్, వెలుగు: ఇండస్ట్రియల్ ఎయిర్ కంప్రెసర్లు తయారు చేసే ఎల్గీ టెక్నాలజీస్​  ‘స్టెబిలైజర్​’ టెక్నాలజీ ఆధారిత కంప్రెసర్లను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఫ్యాక్టరీల్లో/ప్లాంట్లలో గాలి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిష్కరించడానికి, హెచ్చుతగ్గుల సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతాయి.  

లోడ్/అన్‌‌‌‌‌‌‌‌లోడ్ సైకిల్స్​ వల్ల ఏర్పడే సమస్యలను తొలగిస్తాయి. స్టెబిలైజర్​ సిస్టమ్ రీసర్కులేట్​ అండ్​ రికవర్​పద్ధతిలో పనిచేస్తుంది. ఇది కంప్రెసర్ సామర్థ్యాన్ని ప్లాంట్ గాలి అవసరానికి అనుగుణంగా మారుస్తుంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫ్లోలను కంట్రోల్​చేయడం వల్ల లోడ్/అన్‌‌‌‌‌‌‌‌లోడ్ సైకిల్స్​ను తగ్గించి కంప్రెసర్​జీవిత కాలాన్ని పొడగిస్తుంది.