ప్రైవేట్​కు దీటుగా సర్కారు బడులు : ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి

ప్రైవేట్​కు దీటుగా సర్కారు బడులు : ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఖిలా వరంగల్/ పరకాల, వెలుగు : ప్రైవేట్​కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని పరకాల ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 17 వ డివిజన్ బొల్లికుంటలోని జడ్పీహెచ్​ఎస్​లో  అదనపు గదులను ఎంపీ కడియం కావ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య, రుచికరనమైన భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.

హెచ్​ఎం ఆనంద బాబు, పసునూరి వేణుగోపాల్ (సాల్మన్), వాలుగుల రాజు, ఎండీ జూనీ తదితరులు పాల్గొన్నారు. పరకాల మండలం మండలం నాగారం, వెల్లంపల్లి, కామారెడ్డిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే రేవూరి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.