కరీంనగర్క్రైం, వెలుగు : ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని భుజాన వేసుకొని 2 కిలోమీటర్లు నడిచి హాస్పిటల్ కు తరలించి ప్రాణాలు కాపాడిన బ్లూకోల్ట్స్ సిబ్బందిని సీపీ అభిషేక్ గురువారం అభినందించారు. వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి కుర్ర సురేశ్ అనే వ్యక్తి పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
స్థానికులు 100కు ఫోన్ చేయగా బ్లూకోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుల్ జయపాల్ హోంగార్డు సంపత్ అక్కడికి చేరుకొని సురేశ్ ను భుజాన ఎత్తుకొని 2 కిలోమీటర్ల మేర పొలాల గట్లమీదుగా గ్రామంలోకి తీసుకొచ్చారు.
అనంతరం జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని సీపీ అభినందించి రివార్డు అందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు పాల్గొన్నారు.