గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ కనక రాజుకు సీఎం కేసీఆర్ రివార్డు ప్రకటించారు. గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న కనకరాజుకు.. ఆయన సొంత జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు నిర్మాణం ఖర్చులకోసం 1 కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఆయన ఆదేశించారు.
పద్మశ్రీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్
— TRS Party (@trspartyonline) February 1, 2022
గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు శ్రీ కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చులకోసం 1 కోటి రూపాయలను సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు. pic.twitter.com/DFKivkQQDH
అదేవిధంగా డోలువాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు కూడా రివార్డు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు ఆయన సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు.