మావోయిస్టుల కదలికపై సమాచారం ఇస్తే బహుమతులు

మావోయిస్టుల కదలికపై సమాచారం ఇస్తే బహుమతులు

మహాముత్తారం, వెలుగు: మావోయిస్టుల కదలికపై పోలీసులకు సమాచారం ఇస్తే.. బహుమతులు ఇస్తామని ఎస్సై మహేందర్​  కుమార్​ అన్నారు. మహాముత్తారం మండలం దండెపల్లి గొత్తికోయల గూడెంలో గొత్తికోయలను శుక్రవారం ఆయన కలిశారు. మావోయిస్టుల ఆచూకీ తెలిస్తే చెప్పాలని అక్కడ ఫ్లెక్సీని కట్టారు.

కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్​ రూ.20లక్షలు, కుర్సం మంగు అలియాస్ భద్రు రూ.20లక్షలు, ఏగోళపు మల్లయ్య అలియాస్ కోటి రూ. 5లక్షలు, ముచికి ఉంగల్ అలియాస్ నుధాకర్ రూ. 5లక్షలు, కుంజం ఇడమాల్ అలియాన్ మహేందర్ రూ.4లక్షలు, ముసాకి జమున రూ.4లక్షలు, ముసాకి డేవాల్ అలియాస్ కరుణాకర్ రూ.4లక్షలు, నల్లమారి అశోక్ అలియాస్ విజయేందర్ రూ.1లక్ష, మడకం ఇడుమయ్య అలియాస్ మహేశ్ రూ.1లక్ష, కారం బుద్రి అలియస్ రీతా రూ.1లక్ష నజరానాగా ప్రకటించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్సై మహేందర్​ కుమార్​ వారికి వివరించి చెప్పారు.