RFCLలో ప్రొఫెషనల్స్ పోస్టులు.. ఏప్రిల్ 10 లాస్ట్ డేట్

RFCLలో ప్రొఫెషనల్స్ పోస్టులు.. ఏప్రిల్ 10 లాస్ట్ డేట్

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్స్​ పోస్టుల భర్తీకి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్​ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్​సీఎల్) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్​10వ తేదీలోగా ఆన్​ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య 40: ఇంజినీర్ 14, సీనియర్ మేనేజర్ 4, చీఫ్​ మేనేజర్ 7, డిప్యూటీ జనరల్ మేనేజర్​3, మేనేజర్ 2, డిప్యూటీ మేనేజర్​ 1, అసిస్టెంట్​ మేనేజర్ 3, మెడికల్​ ఆఫీసర్ 1, సీనియర్ మెడికల్​ ఆఫీసర్ 1, డిప్యూటీ సీనియర్ మెడికల్​ ఆఫీసర్ 1, అడిషనల్​ సీనియర్ మెడికల్ ఆఫీసర్ 1, సీనియర్ మెడికల్​ ఆఫీసర్ 1. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిప్లొమాలో బీఈ, బీటెక్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, సివిల్, ఎంబీబీఎస్, బీఎస్సీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 

Also Read :- ఇంటర్వ్యూతో ఫ్రొఫెసర్,ఫ్యాకల్టీ జాబ్స్

విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఫైనాన్స్ అండ్​ అకౌంట్స్, సివిల్, మెడికల్, సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
వయోపరిమితి: ఇంజినీర్ కు 30 ఏండ్లు, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మెడికల్​ఆఫీసర్, డిప్యూటీ సీనియర్ మెడికల్​ ఆఫీసర్, అసిస్టెంట్​ మేనేజర్​కు 40 ఏండ్లు, అడిషనల్​ సీనియర్ మెడికల్​ ఆఫీసర్, సీనియర్ మెడికల్​ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ కు 45 ఏండ్లు, చీఫ్​ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్​ కు 50 ఏండ్లు నిండి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా