
- గతేడాది కన్నా రూ.69 కోట్లు ఎక్కువ
- చీఫ్ జనరల్ మేనేజర్ఉదయ్ వెల్లడి
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్అండ్ కెమికల్స్‌లిమిటెడ్(ఆర్ఎఫ్ సీఎల్) సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.510 కోట్ల లాభం ఆర్జించింది. ఫైనాన్సియల్ఇయర్లో 11.95 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయగా అంతే మొత్తంలో వివిధ రాష్ట్రాలకు సప్లై చేయగా.. రూ.5,300 కోట్ల టర్నోవర్సాధించింది. ఇందులో రూ.510 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలంగాణకు 4,68,954.76, ఏపీకి 1,78,363.39, కర్ణాటకకు 1,91,288.07, మహారాష్ట్రకు 82,986.39, చత్తీస్‌గఢ్‌కు 60,640.38 , తమిళనాడుకు 1,01,520.99, మధ్యప్రదేశ్‌కు 1,11,167.19 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేసింది. అదే 2023 –24 ఆర్థక సంవత్సరంలో 11.19 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేయగా.. రూ.441 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
గతేడాదితో పోల్చితే 76 వేల మెట్రిక్ టన్నులను అధిక ఉత్పత్తి చేసి, రూ.69 కోట్ల లాభం ఎక్కువగా పొందగలిగింది. ఎరువుల ఉత్పత్తిలో, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు సమయానుకూలంగా, తగినంత యూరియాను సప్లై చేయడంలో ఆర్ఎఫ్సీఎల్ కీలక పాత్ర పోషిస్తుందని ప్లాంట్చీఫ్ జనరల్మేనేజర్ఉదయ్రాజహంస తెలిపారు.
భవిష్యత్ లో ప్లాంట్ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. టార్గెట్ మేరకు యూరియా ఉత్పత్తిని సాధించడంలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులను అభినందించారు. సంస్థకు మద్దతుగా ఉన్న రాష్ట్ర, జిల్లాకు చెందిన ఆఫీసర్లు, కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.