![ఆర్జీయూకేటీలో డ్రోన్ టెక్నాలజీ వర్క్‌షాప్ షురూ](https://static.v6velugu.com/uploads/2025/02/rgukt-hosts-5-day-workshop-on-drone-technology-for-students_UnLrE8qWNw.jpg)
బాసర, వెలుగు: ఆర్జీయూకేటీలో డ్రోన్ టెక్నాలజీపై వర్క్‌షాప్ షురూ అయ్యింది. ‘డిజైన్ అండ్ ఫ్లై ది డ్రోన్స్’ పేరుతో ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్ ను శనివారం వీసీ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్, ఓఎస్ డీ ప్రొఫెసర్ మురళీ ధర్షన్, ఏవో రణధీర్ సాగి కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీలో అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్, టీహాన్ ఐఐటీ హైదరాబాద్ జత కలవడం సంతోషంగా ఉందన్నారు.
డ్రోన్ పరిమాణం, రకాలు, ఏరోడైనమిక్స్, కంట్రోల్ మెకానిజమ్స్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తద్వారా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్‌లు, పరిశోధనకు అవకాశం కల్పించడం లక్ష్యమన్నారు. ఈ వర్క్ షాప్ ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగవుతాయని కోఆర్డినేటర్ డాక్టర్ రాకేశ్ తెలిపారు. కార్యక్రమంలో అసోషియేట్ డీన్స్, హెచ్ ఓడీ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.