
బాసర, వెలుగు: బాసరలోని ఆర్జీయూకేటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా ప్రొఫెసర్ మురళీ దర్శన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఓఎస్డీ మురళీ దర్శన్ మాట్లాడుతూ వర్సిటీ విజన్‌ని సాధించేందుకు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి పని చేస్తానని చెప్పారు. వర్సిటీ అభివృద్ధికి మురళీ దర్శన్ అనుభవం, అకడమిక్ ఎక్సలెన్స్ ఎంతో తోడ్పడుతుందని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు. కొత్త ఓఎస్డీకి అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.