శృంగార తార మియా మాల్కోవా మీద ఒట్టు.. నీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా: ఆర్జీవీ

శృంగార తార మియా మాల్కోవా మీద ఒట్టు.. నీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా: ఆర్జీవీ

‘అర్జున్ రెడ్డి’ లాంటి సెన్సేషనల్‌‌ హిట్‌‌తో మెప్పించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. రీసెంట్గా యానిమల్తో సక్సెస్ అందుకున్నాడు. రణ్‍వీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.900కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఐఫా అవార్డుల్లో యానిమల్ మూవీ తన ఆధిపత్యం చూపింది. అబుదాబిలో జరిగిన 2024 ఐఫా వేడుకల్లో యానిమల్ మూవీ బెస్ట్ ఫిలిం, బెస్ట్ నెగిటివ్ రోల్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ డిజైన్.. ఇన్ని విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.

ఈ సందర్బంగా యానిమల్ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డినే ఎడిటర్ కూడా కావడంతో బెస్ట్ ఎడిటింగ్ అవార్డును సందీప్ వంగా అందుకున్నాడు. ఈ క్రమంలో స్టేజి మీద సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ విలక్షణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు థ్యాంక్స్ చెప్పారు. దీనికి తన స్టైల్‍లో ఆర్జీవీ స్పందించారు.

ALSO READ | DevaraPart1: దేవరను దారుణంగా దెబ్బకొట్టిన సోమవారం..

"ఈ అవార్డు ఇచ్చినందుకు ఐఫాకు ధన్యవాదాలు. ఈ ఎడిటింగ్ విభాగంలో నేను అవార్డు వస్తుందని అసలు ఊహించలేదు. డైరెక్టర్, నిర్మాత, రైటర్ ఇవన్నీ కాకుండా ఎడిటింగ్ లో వచ్చినందుకు సంతోషంగా ఉంది. చాలా రేర్ అవార్డు ఇది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి. రామ్‍గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని సందీప్ అన్నారు. ఆయన చిత్రాల్లో తాను పని చేయకపోయినా చాలా నేర్చుకున్నానని అన్నారు. ‘థ్యాంక్య్ ఆర్జీవీ సర్’ అని సందీప్ చెప్పారు.

దీంతో ఆర్జీవీ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. "సర్ సందీప్ రెడ్డి వంగా నేను ఇప్పుడు మీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను.  అమెరికన్ శృంగార తార మియా మాల్కోవా, గ్యాంగ్‍స్టర్ దావూద్ ఇబ్రహీం, రష్యన్ రచయిత అయాన్ రాండ్‍తో పాటు సందీప్‍పై కూడా ఒట్టేస్తూ రిప్లై ఇచ్చారు. దీనికి సందీప్ రెడ్డి వంగా సర్.. అంటూ దండం పెట్టే ఎమోజితో రిప్లై ఇచ్చారు.

డైరెక్టర్ రామ్‍ గోపాల్ వర్మపై తనకు ఉన్న గౌరవాన్ని, ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని సందీప్ వంగ గతంలోనూ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఐఫా  అవార్డుల వేడుకలోనూ మరోసారి ఆర్జీవీ గురించి  మాట్లాడటంతో.. వీరి వీడియోస్, ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే ప్రస్తుతం వర్మ శారీ మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ తో స్పిరిట్ గా సందీప్ రెడ్డి బిజీ కాబోతున్నాడు. కాగా యానిమల్ సినిమా సక్సెస్ లో ఎడిటింగ్ చాలా ఇంపాక్ట్ చూపించింది. కొన్ని చోట్ల ఒక సీన్ నుంచి ఒక సీన్‍కు మారే విధానం కూడా ఆకట్టుకుంది. దర్శకుడిగా, ఎడిటర్‌గా సందీప్ అదరగొట్టారు. ఈ అవార్డుకు వంగా వందశాతం అర్హుడని చెప్పొచ్చు.