సెన్సేషనల్ అండ్ కాంట్రవర్శియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)..రీసెంట్ గా హైదరాబాద్ లో RGV డెన్ ను నిర్మించి ట్రెండింగ్ లో నిలిచారు. ఆర్జీవీ డెన్ కు ఇంట్రెస్టేడ్ డైరెక్టర్స్,రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ ట్వీట్ చేశారు RGV. దీంతో ఒక స్పెషల్ నోట్ ను రిలీజ్ చేసి.. ఆర్జీవీ డెన్ కు ఎటువంటి క్రియేటర్స్ కావాలో తెలియజేస్తూ..
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి బయటకు వచ్చిన చాలా మంది యాక్టర్స్ , డైరెక్టర్స్ కొత్తవారిని కలుస్తూనే ఉంటాను.. వారి ట్రైనింగ్ మొత్తం ప్రస్తుత సినీ పరిశ్రమ ఎలా పని చేస్తుందనే విషయంలో..వారు చాలా తప్పుగా ఉన్నారనే విషయం అర్ధం అయింది.. అలాగే ఫిలిం ఇన్స్టిట్యూట్స్ అన్నీ కమర్షియల్ గా మారి.. సినిమా ఇండస్ట్రీ పై కొత్త వారికి సరైన నిర్దేశం చేయట్లేదని ఫీలింగ్ తెలియజేశారు.
ఒక ఫిలిం మేకర్.. మంచి కాన్సెప్ట్ రాసుకుని..తన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ తో కూడా వండర్ క్రియేట్ చేయవచ్చు.. దానికి అనవసరమైన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లకు వెళ్లి.. మీ డబ్బులు వృధా చేసుకోవొద్దు అంటూ సూచించారు.
అలాగే, కొంతమంది ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్ తో నా ఇంటరాక్షన్ టైంలో.. వారు పూర్తిగా డిస్టర్బ్ గా ఉండటం నేను చాలాసార్లు చూశాను. వారిలో ఎక్కువ మంది.. కొన్ని దూర ప్రపంచాలలో నివసిస్తున్నట్లు.. వారు తీయాలనుకుంటున్న మూవీస్ గురించి కొన్ని మీనింగ్ లెస్ థాట్స్ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లు అన్నీ ఔట్ డేటెడ్ గా మారాయి. ముఖ్యంగా డైరెక్టర్‌గా మారడానికి అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా వర్క్ చేయడం అనేది ఒక జోక్..ఉదాహరణకు డైరెక్టర్ శేఖర్ కపూర్, మణిరత్నం, నేను ఎప్పుడూ అసిస్టెంట్‌లుగా వర్క్ చేయలేదు.
కనుక ప్రతి ఒక్కరికి ఓన్ టాలెంట్, క్రియేటివిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని తెలియజేశారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా కంటే గొప్పగా మ్యూజిక్ కంపోజ్ చేస్తామనీ నమ్మకం వుంటేనే RGV డెన్ కు రండి. అనవసరంగా మా టైం ని వృధా చేయకండి.. అంటూ RGV పేర్కొన్నారు.
అందుకు ఆర్జీవీ డెన్ ఒక వెబ్‌సైట్ రూపొందించారు.. అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో ఆర్జీవీ తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆ వెబ్‌సైట్ కి వెళ్లి అప్లై చేసుకోండని ఆర్జీవీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వాటిల్లో మీకు దేంట్లో ట్యాలెంట్ ఉంటే దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ప్రతి కేటగిరికి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి, ఇచ్చిన టాస్కులు చేసి, పర్సనల్ డీటెయిల్స్ తో వాళ్ళు ఇచ్చిన మెయిల్స్ కి పంపించాలని సూచించారు.
ఈ డీటేల్స్ కోసం https://rgvden.com/ సైట్ ని చూస్తే అన్ని వివరాలు మరింత క్లారిటీగా మీకు తెలుస్తాయి. ఇంకెందుకు ఆలస్యం మరి మీరు రైటర్, డైరెక్టర్ అవ్వాలనుకుంటే మీ ట్యాలెంట్ చూపించి ఆర్జీవినే మీకు నిర్మాతగా మారేలా చేసుకోండి.
RGV డెన్ భవనంలో అనేక వింతలు, విశేషాలు ఉన్నాయి. ఈ ఆఫీస్ లోని ప్రాంతాలు రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. అధునాతన స్ర్కీనింగ్ థియేటర్లు, ఇతర సౌకర్యాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆర్జీవీ దీన్ని కార్పొరేట్ కార్యాలయానికి ధీటుగా ఈ ప్రొడక్షన్ హబ్ ను నిర్మించారు. సంవత్సరానికి డజనుకు పైగా చలనచిత్రాలు, బహుళ OTT ప్రదర్శనలు మరియు అన్ని భారతీయ భాషలలో డిజిటల్ కంటెంట్ యొక్క స్పెక్ట్రమ్‌ను రూపొందించడానికి ఉంచబడిన RGV DEN సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను సేకరించడానికి ఒక కేంద్రంగా మారనుంది.