పొగడ్తలతో ముంచే బ్యాచ్ ప్రమాదకరం.. వర్మ ట్వీట్

పొగడ్తలతో ముంచే  బ్యాచ్ ప్రమాదకరం.. వర్మ ట్వీట్

సెన్సేషనల్ అండ్ కాంట్రవర్శియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)  మరోసారి వార్తల్లోకెక్కారు. లేటెస్ట్ గా RGV ట్విట్టర్ ద్వారా మరో ఆసక్తికర పోస్ట్ ను  పోస్ట్ చేశారు.ఈ ట్వీట్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని ఉద్దేశించి చేశారు.  జబర్,హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి చిరు అలవాటుపడియారని..పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు.  రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే అని RGV సూచించారు.  

ఇవాళ(ఆగస్టు11న) రిలీజైన భోళా శంకర్ మూవీకు మిక్సెడ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు..ఈ సినిమా రిలీజ్ విషయంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ తాజా ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ RGV పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

రామ్‌గోపాల్‌వర్మ వ్యూహం(Vyuham), శపథం పేరుతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమయంలో వర్మ తీసిన లక్మిస్ ఎన్టీఆర్ సినిమా తీవ్ర దుమారం స్పృష్టించిన విషయం తెలిసేందే. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ముదురుతున్న రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన  RGV  ఎలక్షన్స్ టైం కి రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే ఈ మూవీలోని ముఖ్య పాత్రల ఫొటోస్  షేర్ చేసి సంచలనం క్రీయేట్ చేశారు.