
నట్టి క్రాంతి, నట్టి కరుణపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంట్రవర్సరీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. నట్టి క్రాంతి, నట్టి కరుణ ఫోర్జరీ పత్రాలతో తనపై కోర్టులో కేసు వేశారని..దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కంప్లైంట్ చేశారు. నవంబర్ 30, 2020న తాను డబ్బులు ఇవ్వాలంటూ నట్టి క్రాంతి, నట్టి కరుణ నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపించారు. ఆ నకిలీ డాక్యుమెంట్స్ తోనే కోర్టులో కేసు వేసి తన సినిమా రిలీజ్ కాకుండా చేశారన్నారు. కోర్టు స్టేతో ఏప్రిల్ 8న రిలీజ్ కావాల్సిన నా ఇష్టం సినిమా ఆగిపోయిందని చెప్పారు. అయితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత అవి ఫేక్ గా గుర్తించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రిటైన్ కంప్లైంట్ ఇచ్చినట్లు వర్మ తెలిపారు.పంజాగుట్ట అడ్రస్ తో తమ ఆఫీసులో ఎలాంటి పత్రాలు లేవని..ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్ కు పంపి నిజానిజాలు తేల్చాలని వర్మ కోరారు.