కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ గత కొద్దిరోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఒక పక్క ఏపీ పోలీసులు వర్మను అరెస్ట్ చేయటం కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తోంటే.. వర్మ మాత్రం దర్జాగా టీవీ, యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. నేనెక్కడికి పారిపోలేదంటూ స్టేట్మెంట్స్ ఇస్తూ పోలీసులను కవ్విస్తున్నారు. తాజాగా.. వర్మను వారం రోజుల వరకు ( డిసెంబర్ 9, 2024 )అరెస్ట్ చేయద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన వర్మ తనదైన స్టైల్ లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఒకవేళ వర్మను అరెస్ట్ చేస్తే.. అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. తనను అరెస్ట్ చేయటానికి వస్తే.. చచ్చినట్టు అరెస్ట్ అవుతానని సమాధానమిచ్చారు. జైల్లో మద్యం, ఫోను, అమ్మాయిలు ఉండరు కదా అంటూ మరో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పరిస్థితిని బట్టి.. ఏ సిచువేషన్ కి అయినా అడాప్ట్ అవుతానని.. జైల్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా గడుపుతానని.. తనదైన స్టైల్ లో సమాధానమిచ్చారు వర్మ.
ALSO READ : డిసెంబర్ 9 వరకు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దు: ఏపీ హైకోర్టు
వర్మ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనను పోలీసులు అరెస్ట్ చేయరన్న ధైర్యంతో వర్మ ఈ కామెంట్స్ చేశారా లేక.. అరెస్ట్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యి ఇలా మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.