సంచలన డైరెక్టర్ ఆర్జీవీ (Rgv) నుంచి వస్తోన్నలేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఆర్జీవీ వ్యూహం,శపథం టైటిల్స్తో రెండు పార్టులుగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
లేటెస్ట్గా వ్యూహం,శపథంకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు ఆర్జీవీ. ట్రైలర్ చంద్రబాబు డైలాగ్ చెబుతూ..జగన్ ని కిందకి లాగడానికి మనకు అతను కావాలి అంటూ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ ఉన్న ట్రైలర్ స్టార్ట్ అయింది. ఎంతో బలమైన పులి సింహం కంటే..పాము, మొసలి అంటే ఎక్కువ భయమెందుకు వేస్తుంది..వాటి కళ్ళలో ఎమోషన్స్ ఉండవు..అచ్చం అలాంటి ఎమోషన్స్ లేని మూడో జీవి చంద్రబాబు నాయుడు అంటూ జగన్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా ఉంది.
ఇక చంద్రబాబు మీటింగ్ లో తొక్కిసలాట చూపించగా..జగన్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియం తీసుకురావడం వంటి అంశాలు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన పొత్తు వ్యవహారాలు..తమ మధ్య ఉన్న కోరికలు..అలాగే చివరలో చంద్రబాబు అరెస్ట్ వంటి అంశాలతో వచ్చిన వ్యూహం శపథం ట్రైలర్ ఆర్జీవీ స్టైల్ లో ఆసక్తిగా ఉంది.
గతేడాది నవంబర్ 13 న రిలీజ్ కావాల్సిన మొదటి పార్ట్ వ్యూహం మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది.ఇపుడు వ్యూహం మూవీ ఈ నెల (ఫిబ్రవరి 23న), శపథం మార్చి 1న రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాకు క్లియరెన్స్ వచ్చాక..ఆర్జీవీ రిలీజ్ డేట్ ప్రకటించడమే కాకుండా..వరుస ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను చెబుతూ వస్తున్నాడు.