Vyooham YSRCP Song: దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు..వైఎస్సార్సీపీ వీడియో సాంగ్ రిలీజ్

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన రీసెంట్ మూవీ వ్యూహం(Vyooham). ఈ మూవీ మార్చి 2న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకుంది. సీఎం వైఎస్ జగన్ జీవితములోని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.  

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి వైఎస్సార్సీపీ (YSRCP) అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్ పాడిన హుషారైన సాంగ్ సీఎం జగన్ అభిమానాలను ఆకట్టుకుంటోంది. 'వైఎస్సార్సీపీ..వైఎస్సార్సీపీ (YSRCP)..ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు..దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు..ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు..సీమ సింగంలా తొడగొట్టే  చూడు..ఊరు ఊరంతా ఉండాలి తోడు..అంటూ ఉన్న ఈ పాటతో జగన్నన్న తమ్ముళ్లు ఫుల్ హుషారులో ఉన్నారు. 

అలాగే వ్యూహం మూవీలో వెన్ను పోటు సాంగ్ కూడా ఆడియన్స్ ని భలే ఆకట్టుకుంది. పులుల రూపంలో గుంట నక్కలు అంటూ తనదైన శైలిలో వర్మ లిరిక్స్ రాబట్టుకున్నాడు.   

వ్యూహం మూవీలో జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటించగా.. వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించింది.‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మించారు.