18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియాగా రియా

18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియాగా రియా

జైపూర్: మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గుజరాత్‎కు చెందిన రియా సింఘా సొంతం చేసుకుంది.  జైపూర్‌ వేదికగా ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024’ పోటీలు జరిగాయి. 51మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ రియా ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్‎కు ఊర్వశీ రౌతేలా న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందని విజేత రియా తెలిపింది. ఈ టైటిల్ గెలుచుకోవడం తన జీవితంలో ఎప్పుడు మరచిపోలేనని చెప్పుకొచ్చింది. 

ALSO READ | ఆస్కార్ అవార్డుకు లాపతా లేడీస్ మూవీ ఎంట్రీ

ఈ పోటీలో పాల్గొనేందుకు చాలా కష్టపడ్డానని తెలిపింది. అనంతరం న్యాయనిర్ణేత ఊర్వశీ రౌతేలా మాట్లాడుతూ.. గ్లోబల్ మిస్‌ యూనివర్స్‌ 2024లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపింది. రియా ఆ పోటీల్లోనూ విజేతగా నిలవాలని ఆకాంక్షించింది.  రియా సింఘా 18  ఏళ్ల వయసులోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించింది.