ఏఐతో అద్భుత ఫలితాలు..స్టాన్లీ కాలేజీలో ఘనంగా ఆర్ఐసీఈ సదస్సు

  •      పాల్గొన్న పలువురు ప్రముఖులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : అతికష్టమైన సమస్యలను ఏఐ సులభంగా పరిష్కరిస్తున్నదని వియత్నాంకు చెందిన హనోయ్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్​మెంట్ హెడ్ డాక్టర్ న్యూఎన్ హంసంగ్ తెలిపారు. ఇండస్ట్రియల్, హెల్త్​ రంగాల్లోనూ ఏఐ అద్భుత ఫలితాలను ఇస్తున్నదన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ

యూనివర్సిటీ ఆఫ్ డాన్ బాస్కో ఆధ్వర్యంలో స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ‘ఆర్ఐసీఈ--–2024’ సదస్సుకు శుక్రవారం ఆయన హాజరై మాట్లాడారు. ఏఐతో సమాచార సేకరణ, విశ్లేషణ సులువైందన్నారు. కార్యక్రమంలో మలేషియా లింకన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మిథున్ చక్రవర్తి, సత్య ప్రసాద్ లంక, అతుల్ నేగి , బిషప్ డా. ఎం.ఏ. డెనియల్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

అన్ని విభాగాల్లోనూ ఏఐ ప్రాముఖ్యత

ఖైరతాబాద్ :  ప్రస్తుతం అన్ని విభాగాల్లో ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని శాస్త్రవేత్త రాజాబాబు అన్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్​లో ‘ఏరో స్పేస్,  రక్షణ రంగంలో ఏఐ వినియోగం’ అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. రక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రాముఖ్యతను వివరించారు.

డీఆర్డీవో విశ్రాంత శాస్త్రవేత్తలు డాక్టర్ వై. శ్రీనివాస రావు, డాక్టర్ ఎం. రామ్మోహన్ బాబు, ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి. వెంకట సుబ్బయ్య, కార్యదర్శి డాక్టర్ కె. సీతారాంబాబు, సహాయ కార్యదర్శి డాక్టర్ ఎల్. నిర్మలా దేవి పాల్గొన్నారు.