మెదక్, చిలప్‌చెడ్, వెలుగు: జిల్లాలో అకాల వర్షాలు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. నెలల పాటు కష్టపడి వడ్లు పండించడం ఒక ఎత్తు అయితే వాటిని అమ్ముకోవడం మరో ఎత్తు అవుతోంది. గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల మెదక్ మార్కెట్ యార్డ్ లో, చిన్నశంకరంపేట, చిలప్ చెడ్ మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసింది.
కొన్ని చోట్ల వరదకు వడ్లు కొట్టుకు పోయాయి. మెదక్ వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో, రామాయంపేట, చిన్నశంకరంపేట, చిలపిచెడ్ మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది.