కరెంటు కోతలపై రైతుల కన్నెర్ర

నల్లగొండ జిల్లాలో కరెంటు కోతలపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్, నల్లగొండ, నాగర్జునసాగర్, తిప్పర్తి సహ పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రైతులు సబ్ స్టేషన్ ను ముట్టడించగా.. ఈరోజు తిప్పార్తి లో ధర్నా చేపట్టారు. వ్యవసాయ బోరు బావులకు నాలుగు గంటలు కూడా కరెంటు రావడం లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది.