![వరికొయ్యలకు నిప్పు.. మంటల్లో పడి రైతు మృతి](https://static.v6velugu.com/uploads/2024/11/rice-fields-catch-fire-after-farmer-dies-in-flames_GxMyXrjF1I.jpg)
సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లిలో ఘటన
కోహెడ, వెలుగు : వరి కొయ్యలకు నిప్పు పెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లో పడి చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తంగళ్లపల్లి గ్రామానికి చెందిన లెంకల రాజయ్య (57) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం తన పొలం వద్దకు వెళ్లి వరి కొయ్యలకు నిప్పు అంటించాడు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో వాటిని ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పొగకు ఊపిరి ఆడకపోవడంతో మంటల్లో పడి కాలిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై అభిలాష్ తెలిపారు.