నెట్ వర్క్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఐకేపీ, పీఏసీఎస్ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మాక్లూర్ మండలం వెంకటాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్దాదన్నగారి విఠల్‌రావు ప్రారంభించారు. సర్పంచ్ భవాని , పీడీ చందర్నాయక్తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద మండలం వాజీద్నగర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ప్రారంభించారు. ఎంపీపీ అశోక్‌పటేల్, జడ్పీటీసీ భారతిరాజు, సర్పంచ్ అనసూయ తదితరులు పాల్గొన్నారు. రెంజల్మండలంలోని నీలా గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని వైస్‌ఎంపీపీ యోగేశ్ ప్రారంభించారు. సర్పంచ్లలిత, ఎంపీటీసీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్.. గూపన్పల్లి, ముత్తకుంట సొసైటీ పరిధిలోని మల్కాపూర్తండా, మల్లారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ అనూష, చైర్మన్రవీందర్ప్రారంభించారు. నవీపేట మండలం నాగేపూర్సొసైటీ పరిధిలోని యంచలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్శైలేశ్ప్రారంభించారు. సిరికొండ మండలం.. పోత్నూర్, మైలారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ సంగీత ప్రారంభించారు. సర్పంచ్‌లు మంజుల, రమ్య, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వడ్లను దళారులకు అమ్మి మోసపోకుండా, కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని లాభాలు పొందాలన్నారు.
పక్క రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా చూడాలి
కామారెడ్డి టౌన్, వెలుగు: యాసంగి సీజన్ వడ్లు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రాకుండా జిల్లా యంత్రాంగం కట్టడి చేయాలని డీజీపీ అంజనీకుమార్ జిల్లా ఆఫీసర్లకు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ.. కర్నాటక, మహారాష్ర్ట లు జిల్లాకు బార్డర్ ఉండడంతో అక్కడి నుంచి వడ్లు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ఎస్పీ పాల్గొన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్‌రూం..కామారెడ్డి కలెక్టరేట్లో వడ్ల కొనుగోలు కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ను మంగళవారం అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ ప్రారంభించారు.