వడ్ల పొట్టుతో కరెంటు తయారీ చేస్తోన్న రైస్ మిల్లు

రోజుకో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న వేళ వడ్ల పొట్టుతో విద్యుత్ ను తయారుచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్గొండ జిల్లాలోని హాలియా ప్రాంతంలో 2022, నవంబర్ 11వ తేదీన ప్రారంభమైన వజ్రతేజ  క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రైస్ మిల్లు.. ఏడెకరాల్లో సుమారు రూ.100 వ్యయంతో నిర్మించారు. ధాన్యం మిల్లుకు వచ్చిన దగ్గర్నుంచి బియ్యమై లారీల్లో వెళ్లే దాకా అంతా తామే చూసుకుంటామని మిల్లు సిబ్బంది చెబుతున్నారు. అంతే కాకుండా వడ్ల నుంచి వచ్చే పొట్టు ద్వారా 1.3మెగావాట్స్ విద్యుత్ ను తాము తయారు చేస్తున్నామంటున్నారు. తక్కువైన కరెంటును గవర్నమెంటు నుంచి తీసుకుంటున్నామని చెప్పారు. గంటకు 1300 హెచ్ పీ కరెంటు తయారవుతోందన్న ఆయన.. చుట్టుపక్కల నుంచి వచ్చే ధాన్యమే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని కూడా కొనగలుగుతున్నామని తెలియజేశారు.

ఈ మిల్లులో గ్యాస్ కనెక్షన్, డస్ట్ కనెక్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం 300 మంది సిబ్బందితో సాగుతోన్న ఈ మిల్లులో.. బాయిల్ చేసిన వాటర్ ను కూడా రీయూజ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతే కాదు మామూలుగా రైస్ మిల్లు అనగానే పొల్యూషన్, చెత్త లాంటివి కనిపిస్తాయి. కానీ ఈ మిల్లులో అలాంటి వాతావరణం కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని మిల్లు నిర్వాహకులు చెబుతున్నారు. గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా కార్పొరేట్ తరహాలో తమ మిల్లును రూపొందించడమే తమ లక్ష్యమని అంటున్నారు. బియ్యాన్ని కూడా చేత్తో ముట్టుకోకుండా రైస్ బ్యాగ్ లను ప్యాకింగ్ చేస్తామంటున్నారు.