- 2022–23 సీజన్లో 23 మిల్లులకు 73 వేల టన్నులు కేటాయింపు
- మిల్లింగ్ చేయకపోవడంతో 53 వేల టన్నులు వేలం వేసిన గవర్నమెంట్
- ఇందులో 45 వేల టన్నుల వడ్లను అమ్ముకున్న మిల్లర్లు
- మిల్లులపై క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కారుకు శఠగోపం పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.100 కోట్ల విలువైన వడ్లు మాయం చేశారు. రికవరీ కోసం ప్రభుత్వం వారికి ఎన్ని గడువులు ఇచ్చినా సీఎమ్మార్ పెట్టకపోగా గవర్నమెంట్ ఆదేశాలను లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సదరు మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సివిల్ సప్లయిస్ ఆఫీసర్లు రంగం సిద్ధం చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలతో మిల్లర్లపై కొరడా ఝుళిపించునున్నారు.
ఆ వడ్లను అమ్ముకున్నరు
ప్రభుత్వం 2022–23లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన వడ్లను ప్రభుత్వం మిల్లింగ్ కోసం మిల్లర్లకు ఇచ్చింది. జిల్లాలోని 23 మంది మిల్లర్లకు 73,425 మెట్రిక్ టన్నుల వడ్లను ఇవ్వగా వారు సకాలంలో మిల్లింగ్ చేసి సీఎమ్మార్ పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఇలా రాష్ట్రవ్యా ప్తంగా మిల్లుల్లో పేరుకుపోయిన వడ్లను ప్రభుత్వం వేలం ద్వారా అమ్మింది. మంచిర్యాల జిల్లాలో 23 మిల్లులో 52,868 మెట్రిక్ టన్నుల వడ్లను యాక్షన్ లో అమ్మారు.
వీటిలో 7169 టన్నుల వడ్లను మిల్లుల నుంచి లిఫ్ట్ చేశారు. అయితే మిల్లుల్లో నిల్వ ఉండాల్సిన మిగతా 45,698 మెట్రిక్ టన్నుల వడ్లను మిల్లర్లు మాయం చేశారు. వడ్లను కొంతమంది బియ్యంగా మార్చి ఓపెన్ మార్కెట్లో అమ్ముకోగా.. మరికొందరు ఏకంగా వడ్లనే అమ్ముకున్నట్టు అధికారులు గుర్తించారు.
రూ.100 కోట్ల విలువ
23 మంది మిల్లర్లు మాయం చేసిన వడ్ల విలువ రూ.100.53 కోట్లుగా సివిల్ సప్లయిస్ అధికా రులు తేల్చారు. రికవరీ కోసం పలుమార్లు గడువులు ఇచ్చినప్పటికీ మిల్లర్లు లైట్ తీసుకున్నారు. దీనితో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదరు మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఫైల్ రెడీ చేశారు. ఇందులో ఇప్పటికే ఏడుగురు మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. వీరిలో నలుగురిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు బుక్ చేసిన ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకు న్నారు. మిగతా 16 మిల్లులపై కూడా రెండు మూడు రోజుల్లో క్రిమినల్ కేసులు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఆ 23 మిల్లులు ఇవే..
రాఘవేంద్ర ఇండస్ట్రీస్ (మొర్రిగూడ, జన్నారం) రూ.12.86 కోట్లు, రాజరాజేశ్వరి ట్రేడర్స్ (నర్సింగాపూర్) రూ. 9.96 కోట్లు, రామ లక్ష్మణ్ ఇండస్ట్రీస్ (లింగాపూర్) రూ.8.60 కోట్లు, గాయత్రి పారా బాయిల్డ్ (సబ్బెపల్లి) రూ.7.20 కోట్లు, శ్రీ సాయి మణికంఠ ట్రేడర్స్(నర్సింగాపూర్) రూ.5.54 కోట్లు, వరలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ (ఇందారం) రూ.3.96 కోట్లు, శ్రీలక్ష్మీ శ్రీనివాస ఇండస్ట్రీస్ (నందులపల్లి) రూ.2.79 కోట్లు, లక్ష్మీ గణపతి పారా బాయిల్డ్ రైస్ మిల్ (అందుగుల పేట్) రూ2.73 కోట్లు, జయలక్ష్మి ఇండస్ట్రీస్ (ఇందారం) రూ.2.55 కోట్లు, శ్రీనివాస రైస్ మిల్(హమాలి వాడ మంచిర్యాల) రూ.2.02 కోట్లు
ALSO READ :కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే
ఎస్ఆర్ఎం ఇండస్ట్రీస్ (సబ్బెపల్లి) రూ.2.01 కోట్లు, వాసవి పారా బాయిల్డ్ రైస్ మిల్ (అందుగుల పేట్) రూ.1.94 కోట్లు, శివ సాయి ఎంటర్ ప్రైజెస్ (లక్షెట్టిపేట) రూ.1.93 కోట్లు, వెంకటేశ్వర పారా బాయిల్డ్ రైస్ మిల్ ( కన్నెపల్లి) రూ.1.82 కోట్లు,రాధాకృష్ణ ఇండస్ట్రీస్ (దండేపల్లి) రూ.1.28 కోట్లు, శ్రీ శివ రామకృష్ణ ట్రేడర్స్(లక్షెట్టిపేట, మిట్టపల్లి) రూ.16 లక్షలు.
ఆర్ఆర్ యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదైన రైస్ మిల్లులు
బీఎస్ వై రా రైస్ మిల్ (ముదిగుంట) రూ.8.49 కోట్లు, దుర్గ ఇండస్ట్రీస్ (నర్సింగాపూర్) రూ.8.16 కోట్లు, హనుమాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ (మంచిర్యాల) రూ.6.21 కోట్లు, వాసవి మాతా మోడ్రన్ రైస్ మిల్ (రేచిని) రూ.5.79 కోట్లు, శ్రీ వెంకట రమణ ఆగ్రో ఇండస్ట్రీస్ (కోటపల్లి) రూ.1.79 కోట్లు, సోమేశ్వర రైస్ మిల్ (ఆస్నాద్) రూ.1.76 కోట్లు, శ్రీ రాజ రాజేశ్వర మోడ్రన్ రైస్ మిల్ (కత్తెరసాల) రూ.1.01 కోట్లు.