భారత మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తన 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ నుంచి తప్పుకుంది. ఘోష్ 2020 లో టీమిండియా తరపున అరంగేట్రం చేసింది . అప్పటికి ఆమె వయసు 16 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె వయసు 21 సంవత్సరాలు. టీమిండియా వికెట్ కీపర్ గా ఫినిషర్ గా ఘోష్ మంచి గుర్తింపు పొందింది.
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ గురువారం (అక్టోబర్ 17) అనౌన్స్ చేసింది. కివీస్‌తో వన్డే పోరుకు మొత్తం 16 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించింది. స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళ జట్టును నడిపించనుంది. ఆల్ రౌండర్ -ఆశా శోభన గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కానుంది. సీనియర్ బౌలర్ పూజా వస్త్రాకర్‌కు బీసీసీఐ ఈ సిరీస్‌లో రెస్ట్ కల్పించింది.
Also Read :- వికెట్ కీపర్‌గా జురెల్.. పంత్ గాయంపై బీసీసీఐ అప్ డేట్
ఈ నెల 24, 27, 29వ తేదీల్లో అహ్మదాబాద్‌లో జరిగే మూడు వన్డేల కోసం గురువారం ప్రకటించిన జట్టులో సెలెక్టర్లు నలుగురు కొత్త ప్లేయర్లు తేజల్ హెసబ్నిస్, సయాలీ సత్గారె, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్‌కు అవకాశం ఇచ్చారు.
🚨 Richa Ghosh unavailable for New Zealand series due to her 12th Board exams. 🚨 pic.twitter.com/qbt6FYd2QL
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 17, 2024