WPL 2025: నువ్వు మా ఏబీ డివిలియర్స్.. టీమిండియా బ్యాటర్‌ హిట్టింగ్‌కు నెటిజన్ ఫిదా

WPL 2025: నువ్వు మా ఏబీ డివిలియర్స్.. టీమిండియా బ్యాటర్‌ హిట్టింగ్‌కు నెటిజన్ ఫిదా

విమెన్స్ ప్రీమియర్ లీగ్‌‌‌‌‌‌‌‌(డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌) మూడో ఎడిషన్‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్‌‌‌‌‌‌‌‌పై డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ రాయల్ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరుదే ఘన విజయం సాధించింది. 202 పరుగుల  పైచేయి అయింది. భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేసి రికార్డు సృష్టించిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ కొత్త ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో శుభారంభం చేసింది. సాధారణంగా 202 పరుగుల లక్ష్యం అంటే మహిళల క్రికెట్ లో అసాధ్యం. ఇప్పటివరకు ఏ జట్టు కూడా 200 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేకపోయింది. అయితే ఆర్సీబీ మాత్రం అద్భుతం చేసింది.

బెంగళూరు విజయంలో టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం 27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసి ఓడిపోయే మ్యాచ్ లో జట్టుకు విజయాన్ని అందించింది. రిచా హిట్టింగ్ కు ఫ్యాన్ ఫిదా అయిపోయాడు. ఆమె పవర్ హిట్టింగ్ ను ఏకంగా మెన్స్ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తో పోల్చాడు. ఘోష్ కొట్టిన సిక్సర్ తనకు డివిలియర్స్ ను గుర్తుకు తెచ్చిందని ఆ అభిమాని సంతోషంతో కేరింతలు కొట్టాడు. ఈ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read :  బుమ్రా లేకపోతే ఏం కాదు

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 201/5 స్కోరు చేసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్ ఆష్లే గార్డ్‌‌‌‌‌‌‌‌నర్ (37 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 నాటౌట్‌‌‌‌‌‌‌‌, 2/33),బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (42 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లతో 56) ఫిఫ్టీలతో సత్తా చాటారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ  18.3  ఓవర్లలోనే 202/4  స్కోరు చేసి గెలిచింది. లీగ్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజ్ చేసిన జట్టుగా నిలిచింది. కనిక అహుజా (13 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లతో 30 నాటౌట్‌‌‌‌‌‌‌‌), రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 37 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 93 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని గెలిపించారు. ఎలైస్ పెర్రీ  (34 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57)  కీలక ఇన్నింగ్స్ ఆడింది.