అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ADR ) దేశంలోని సీఎంలకు చెందిన ఆస్తుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. చంద్రబాబుకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 931 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేంజ్ లో ఆస్తులున్న ఏకైక సీఎంగా నిలిచారు చంద్రబాబు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అత్యంత పేద సీఎంగా నిలిచారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల ఆస్తుల జాబితా రిలీజ్ చేసింది ఏడీఆర్ ఈ జాబితాలో పలు కీలక అంశాలను వెల్లడించింది ఏడీఆర్.
ALSO READ | ఏపీ CM చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ కృతజ్ఞతలు
సీఎం చంద్రబాబు తర్వాత రూ. 332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. ఆయనకు రూ. 51 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది ఏడీఆర్.ఇదిలా ఉండగా.. తక్కువ ఆస్తులు ఉన్న ముగ్గురు సీఎంలలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అగ్రస్థానంలో నిలిచారు. మమతకు ఎలాంటి స్థిరాస్తులు లేకపోగా కేవలం రూ.15 కోట్ల మేర చరస్తులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
తక్కువ ఆస్తులు ఉన్న సీఎంల జాబితాలో రెండో స్థానంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఉండగా.. మూడో స్థానంలో కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. గతంలో వైసీపీ అధినేత జగన్ దేశంలో సంపన్న సీఎంగా నిలిచినప్పుడు అవినీతి చక్రవర్తి అంటూ కామెంట్స్ చేసిన చంద్రబాబు ఇప్పుడేమంటారంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు.