పాకిస్థాన్ లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. హిందువులు తక్కువ సంఖ్యలో ఉంటారు. మన దేశంలో ముస్లింలు ఎలా మైనార్టీనో అక్కడ హిందువులుమైనార్టీలు అన్నమాట. 1947లో జరిగిన విభజన తర్వాత కొంతమంది హిందువులు పాకిస్థాన్ లోనే ఉండిపోయారు. అలాంటి వారిలో సంగీత ఒకరు. ఇప్పుడు ఈమె పాకిస్థాన్ లోనే రిచెస్ట్ హిందూ మహిళ కావడం విశేషం. ఇంతకీ ఈ సంగీత ఎవరు.. ఆమె సంపాదన ఎంతో ఓ సారి తెలుసుకుందాం.
విభజనకు ముందు ఇండియాలో జన్మించిన సంగీత హిందూ మహిళగానే పాకిస్థాన్‌లో జీవనం కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయినప్పుడు అత్యంత సంపన్నుల జాబితాలో కొందరు హిందువులు కూడా ఉన్నారు. ఇందులో అత్యంత ధనిక హిందువు దీపక్ పెర్వానీ అనే ఫ్యాషన్ డిజైనర్ కాగా హిందూ రిచెస్ట్ మహిళగా 'సంగీత' రికార్డు సృష్టించింది. అయితే వీరిద్దరూ సినీ రంగానికి చెందిన వారు కావడం విశేషం.
సంగీతను పర్వీన్ రిజ్వీ అని కూడా పిలుస్తారు. సంగీత అనే పేరు అక్కడి మతానికి వ్యతిరేకంగా ఉండటంతో అనే పేరును కాస్త పర్వీన్ రిజ్వీగా పేరు మార్చుకుంది. పాకిస్థానీ సీని రంగంలో ఈమె ఓ నటిగానే కాకుండా ఓ దర్శకురాలిగా కూడా పేరు సంపాదించుకుంది. తన 21 ఏట నుండి అక్కడి చలనచిత్ర పరిశ్రమలో చురుకుగా పనిచేస్తుంది.
45 సంవత్సరాల క్రితం కో హినూర్ అనే చిత్రంతో వెండితెర పైకి అడుగుపెట్టింది సంగీత.నికా, ముఠ్ఠీ బార్ చావల్, యే అమన్, నామ్ మేరా బద్నామ్ వంటి అగ్ర చిత్రాలలో ఆమె నటించింది. తక్కువ కాలంలోనే సంగీత ఎక్కువ ఫేమస్ అయింది. సంగీతకు పాకిస్తాన్ లోనే కాదు భారత్ లో కూడా బలమైన సంబంధాలున్నాయి. దివంగత భారతీయ నటి జియాఖాన్ కు ఈమె అత్త. ఇక సంగీత సంవత్సరానికి రూ. 39 కోట్లు వరకు సంపాదిస్తు్దని తెలుస్తోంది.