హైదరాబాద్, వెలుగు: బయో శానిటేషన్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన రిచీ రాఫెల్ బయోటెక్‌కు ప్రతిష్టాత్మక 'ఇండియా ఎక్సలెన్స్ అవార్డు - ఎన్.విరాన్మెంటల్ ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ ది ఇయర్ 2023-24' అవార్డు వచ్చింది. కంపెనీ డైరెక్టర్ పిడింట్ల చంద్రశేఖర్ రెడ్డికి లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ అవార్డును అందజేశారు.
రిచీ రాఫెల్ బయోటెక్ విషపూరిత రసాయనాలు వాడకుండా సేంద్రీయ బయో- ఎంజైమ్స్‌ను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుతుందని, ఇదే తమను గ్రీన్ టెక్నాలజీ రంగంలో ప్రముఖ స్థానంలో నిలబెట్టిందని అన్నారు. రిచీ రాఫెల్ బయోటెక్ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నివారణ, అంటువ్యాధుల నివారణలో ముందంజలో ఉన్నట్లు రెడ్డి తెలిపారు.