కేప్ టౌన్ : పాకిస్తాన్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. రికెల్టన్ (259) డబుల్ సెంచరీకి తోడు కైల్ వెరెన్ (100) సెంచరీ బాదడంతో.. 316/4 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 141.3 ఓవర్లలో 615 రన్స్‌కు ఆలౌటైంది. వెరెన్‌తో ఆరో వికెట్‌కు 148 రన్స్ జత చేసిన రికెల్టన్.. యాన్సెన్ (62)తో ఏడో వికెట్‌కు 86 రన్స్ జోడించాడు.
కేశవ్ మహారాజ్ (40) ఫర్వాలేదనిపించాడు. అబ్బాస్, సల్మాన్ చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 64/3 స్కోరు చేసింది. బాబర్ ఆజమ్ (31 బ్యాటింగ్), రిజ్వాన్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రబాడ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పాక్ ఇంకా 551 రన్స్ వెనుకంజలో ఉంది. మూడు రోజుల ఆట మిగిలి ఉంది.