న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఎంపిక చేసిన ఇండియా టీమ్‌లో సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్ రికీ పాంటింగ్ అన్నాడు. రిషబ్ పంత్ లేకపోవడంతో బ్యాకప్ వికెట్ కీపర్‌గా తీసుకున్న ఇషాన్ కిషన్ ఎక్స్ ఫ్యాక్టర్‌గా ప్రభావం చూపిస్తాడన్నాడు.
‘డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే టీమ్‌లో సూర్య ఉండాల్సింది. అతన్ని ఎందుకు పక్కనబెట్టారో తెలియదు. అయితే ఇషాన్ రాకతో టీమ్ డైనమిక్స్ చాలా మారిపోయాయి. టాప్ ఆర్డర్ ఫెయిలైనప్పుడు పంత్ చాలాసార్లు ఆదుకున్నాడు. అదే తరహాలో ఇషాన్ ఎక్స్ ఫ్యాక్టర్‌గా ప్రభావం చూపిస్తాడు. కుర్రాళ్లను తీసుకుంటే దూకుడుగా ఆడేలా వాళ్లకు చాన్స్ ఇవ్వాలి’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇండియాతో మ్యాచ్‌లో ఫలితాన్ని రాబట్టాలంటే ఆసీస్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నాడు.