Ricky Ponting: నా జీవితంలో అలాంటి గొప్ప వన్డే ప్లేయర్‌ను చూడలేదు: రికీ పాంటింగ్

Ricky Ponting: నా జీవితంలో అలాంటి గొప్ప వన్డే ప్లేయర్‌ను చూడలేదు: రికీ పాంటింగ్

గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్‌ ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. 150 సంవత్సరాల క్రికెట్ లో ఎంతో మంది క్రికెటర్లు తమదైన ముద్ర వేశారు. ఇందులో భాగంగా డాన్ బ్రాడ్‌మాన్, సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్, విరాట్ కోహ్లీ  క్రికెట్ లో లెక్కలేనన్ని రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. చాలామంది ఈ నలుగురిలో ఒకరిని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్‌ గా భావిస్తారు. అయితే ఆల్ టైం గ్రేటెస్ట్ వన్డే ప్లేయర్ ఎవరని అడిగితే మాత్రం ఠక్కున విరాట్ కోహ్లీ పేరే చెప్పేస్తారు. 

కోహ్లీ అసాధారణ నిలకడ, రికార్డులే అతన్ని వన్డే రారాజుగా చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ సైతం వన్డేల్లో ఆల్ టైం  బెస్ట్ బ్యాటర్ గా కోహ్లీని అభివర్ణించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 23) పాకిస్థాన్ తో జరిగిన బ్లాక్‌బస్టర్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. పాత కోహ్లీని గుర్తు చేస్తూ ఎంతో బాధ్యతగా ఆడుతూ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. వన్డేల్లో 51 వ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను ఫిదా చేసింది. 

Also Read :- మా ఆటగాడికి బుద్ది లేదు

కోహ్లీపై ప్రసంశలు కురిపిస్తూ అతడిని ఆల్ టైం బెస్ట్ వన్డే బ్యాటర్ అని కితాబులిచ్చాడు. పాంటింగ్ మాట్లాడుతూ.. " కోహ్లీ చాలా కాలంగా ఛాంపియన్ ఆటగాడు. ముఖ్యంగా వైట్-బాల్ ఫార్మాట్లలో అతని నమ్మశక్యం కాని విధంగా ఉంది. విరాట్ టాప్ వన్డే ఆటగాడు. విరాట్ కోహ్లీ కంటే మెరుగైన 50 ఓవర్ల ఆటగాడిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అతను నన్ను దాటేసి మరో ఇద్దరి వెనుక ఉన్నాడు. సచిన్ కంటే కోహ్లీ 4,000 పరుగులు వెనుకబడి ఉన్నాడు. ఇప్పుడే రికార్డ్ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు". అని ఈ మాజీ ఆసీస్ ఆటగాడు చెప్పుకొచ్చాడు.