ఐపీఎల్ మెగా ఆక్షన్ లో పంజాబ్ కింగ్స్ ఎప్పుడూ లేని విధంగా ఐదుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లను తీసుకుంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కు హెడ్ కోచ్ గా ఉంటున్న రికీ పాంటింగ్ దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా ఉన్న పాంటింగ్ ను ఆ జట్టు వదిలేసుకుంది. దీంతో ఈ ఆసీస్ దిగ్గజం పంజాబ్ తో జత కట్టాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్ లో పాంటింగ్ తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా కావడంతోనే అతను కావాలని తమ దేశం ప్లేయర్లను తీసుకున్నాడని నెటిజన్స్ విమర్శలు గుప్పించారు.
ALSO READ | IND vs AUS: రెండో టెస్టుకు రోహిత్, గిల్ సిద్ధం.. అడిలైడ్ టెస్టుకు ఆ ఇద్దరిపై వేటు
ఈ విషయం పై పాంటింగ్ తాజాగా స్పందించాడు. తాము ఎందుకు ఆసీస్ క్రికెటరలను తీసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. "మా జట్టులో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉండడం ద్వారా మాపై విమర్శలు రావడం సహజం. ఎనిమిది మంది ఓవర్సీస్ ఆటగాళ్లలో మేము ఐదుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లను తీసుకున్నాం. జట్టుకు తగ్గట్టుగానే మేము వారిని తీసుకున్నాం. ఆయా పాత్రలకు ఎవరు సరిపోతారో చూసే తీసుకున్నాం.
మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లు కింగ్స్‌కు తిరిగి రావడం సంతోషించ దగ్గ విషయం. వారికి గతంలో ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. జేవియర్ బార్ట్‌లెట్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్‌తో సహా ఇద్దరు కొత్త కుర్రాళ్ళు మొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్నారు. ఇది మాకు చాలా ఉత్తేజకరమైనది". అని పాంటింగ్ తెలిపాడు.
ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన టాప్ -5 ఆటగాళ్ల పూర్తి జాబితా
శ్రేయాస్ అయ్యర్ ( రూ. 26.75 కోట్లు),
యుజ్వేంద్ర చాహల్ ( రూ. 18 కోట్లు)
అర్ష్‌దీప్ సింగ్ ( రూ. 18 కోట్లు)
మార్కస్ స్టోయినిస్ ( రూ 11 కోట్లు)
మార్కో జాన్సెన్ ( రూ 7 కోట్లు)
పంజాబ్ కింగ్స్ రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితా
శశాంక్ సింగ్ ( రూ 5.50 కోట్లు)
ప్రభసిమ్రాన్ సింగ్ ( రూ 4 కోట్లు)