దుబాయ్: టెస్ట్ క్రికెట్లో సచిన్ హయ్యెస్ట్ రన్స్ రికార్డును ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అధిగమిస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. రాబోయే నాలుగేళ్లు రూట్ పరుగుల దాహాన్ని స్థిరంగా కొనసాగిస్తే ఈజీగా దాటేస్తాడన్నాడు. సచిన్ (15,921), పాంటింగ్ (13,378) రన్స్‌తో టాప్–2లో ఉండగా, రూట్ 12,027 రన్స్‌తో ఏడో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ‘రూట్ వయసు 33 ఏళ్లు.
మరో 4 ఏళ్లు ఆడతాడు. సచిన్ కంటే ఇంచుమించు 4 వేల రన్స్ వెనకబడి ఉన్నాడు. ఏడాదికి10,14 మ్యాచ్‌లు ఆడినా వెయ్యి రన్స్ చేస్తాడు. కాకపోతే ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.