Ricky Ponting: సచిన్, బ్రాడ్‌మాన్ కాదు.. అతడే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్‌: రికీ పాంటింగ్

Ricky Ponting: సచిన్, బ్రాడ్‌మాన్ కాదు.. అతడే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్‌: రికీ పాంటింగ్

గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్‌ ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. 150 సంవత్సరాల క్రికెట్ లో ఎంతో మంది క్రికెటర్లు తమదైన ముద్ర వేశారు. ఇందులో భాగంగా డాన్ బ్రాడ్‌మాన్, సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్, విరాట్ కోహ్లీ  క్రికెట్ లో లెక్కలేనన్ని రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. చాలామంది ఈ నలుగురిలో ఒకరిని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్‌ గా భావిస్తారు. లేకపోతే తమ దేశ దిగ్గజ క్రికెటర్ ను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని భావిస్తారు.

ప్రేక్షకుల అభిప్రాయలు పక్కన పెడితే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ క్రికెట్ లో ఎవరు ఆల్ టైం బెస్ట్ అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. పాంటింగ్ ఆల్ టైం బెస్ట్ ఆటగాడిగా తమ దేశ దిగ్గజ క్రికెటర్లు డాన్ బ్రాడ్‌మాన్, అలెన్ బోర్డర్  పేరు చెప్పలేదు. ఇక టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేరును కూడా పక్కనపెట్టాడు. ముత్తయ్య మురళీధరన్, గ్యారీ సోబర్స్ లాంటి ఆటగాళ్లను సైతం తిరస్కరించిన పాంటింగ్.. సౌతాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ ను తన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్‌ గా ఎంపిక చేశాడు. 

Also Read :- కోహ్లీని ఔట్ చేయడానికి బస్సు డ్రైవర్ సలహా తీసుకున్నా

పాంటింగ్ మాట్లాడుతూ.. "జాక్వెస్ కల్లిస్ ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ క్రికెటర్. మిగతా వారందరి సంగతి నాకు తెలియదు. నా వరకు అతనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్‌. టెస్టుల్లో 13,000 పరుగులు.. 45 టెస్ట్ సెంచరీలు.. 300 వికెట్లు. కెరీర్ లో బ్యాటింగ్ లో లేదా బౌలింగ్ లో గొప్ప గణాంకాలు ఉండవచ్చు. కల్లిస్ కు మాత్రం ఈ రెండు కలిగి ఉన్నాడు. స్లిప్స్‌లో అసాధారణ ఫీల్డర్. క్రికెట్ లో అతన్ని అందరూ తక్కువగా అంచనా వేస్తారు. అతని గురించి ఎవరూ మాట్లాడరు. మీడియా కల్లిస్ ను ఎప్పుడూ హైలెట్ చేయలేదు. అని పాంటింగ్ తెలిపాడు.