IPL 2025: ఇదొక పిచ్చి నిర్ణయం.. మెగా ఆక్షన్ తేదీలపై దిగ్గజ క్రికెటర్లు విమర్శలు

IPL 2025: ఇదొక పిచ్చి నిర్ణయం.. మెగా ఆక్షన్ తేదీలపై దిగ్గజ క్రికెటర్లు విమర్శలు

నవంబర్ 24.. ఓ వైపు ఐపీఎల్ వేలం.. మరో వైపు భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఇంకో వైపు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. ఒకరకంగా క్రికెట్ అభిమానులకు ఈ రోజు పండగ లాంటి వార్త. నవంబర్ 22-26 తేదీలలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది. నవంబర్ 24,25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. టెస్ట్ మ్యాచ్ మూడు, నాలుగు రోజులు ఐపీఎల్ మెగా ఆక్షన్ తో క్లాష్ కానుంది. అయితే మ్యాచ్ ఉదయం 7:50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరో వైపు ఐపీఎల్ ఆక్షన్ మధ్యాహ్నం మొదలవుతుంది. అయితే ఒకే రోజు టెస్ట్ మ్యాచ్, ఐపీఎల్ ఆక్షన్ పై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. 

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఐపీఎల్ మెగా ఆక్షన్ తేదీ, టైమింగ్ మార్పులపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై వాన్ మాట్లాడుతూ " మొదటి టెస్టు మధ్యలో ఐపీఎల్ వేలం నిర్వహించడాన్ని నేను అంగీకరించను. ఇది హాస్యాస్పదంగా ఉంది. మొదటి, రెండవ టెస్ట్‌ల మధ్యలో మధ్య తొమ్మిది రోజుల విరామం ఉంది. ఈ గ్యాప్ లో నిర్వహించకుండా తొలి టెస్టుతో క్లాష్ అవ్వడం నాకు పిచ్చితనంగా అనిపించింది". అని వాన్ కోడ్ స్పోర్ట్స్‌తో అన్నారు.

Also Read :- అప్పుడే తుది నిర్ణయం తీసుకుంటాం.. గిల్ గాయంపై భారత బౌలింగ్ కోచ్

పాంటింగ్ ఐపీఎల్ సమయపాలనపై తన నిరాశను వ్యక్తం చేశాడు. " క్రికెట్ లో అత్యంత అంచనాలున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఐపీఎల్ ఆక్షన్ అంతరాయం కలిగిస్తుంది. గత రెండు నెలలుగా తొలి రెండు టెస్టులకు గ్యాప్ ఉంటుందని భావించాం. ఇలా జరిగితే ఆటగాళ్ల మధ్య ఒత్తిడి కూడా తొలగిపోతుంది". అని పాంటింగ్ అన్నాడు. మెగా ఆక్షన్ కావడంతో రికీ పాంటింగ్ ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం భారత్ కు రానున్నారు. వాస్తవానికి అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టుకు కామెంట్రీ చేయాల్సింది.

ఐపీఎల్ మెగా ఆక్షన్ కారణంగా ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లో కేవలం తొలి రోజు మాత్రమే కామెంట్రీ చేయనున్నాడు. నవంబర్ 22 న తొలి టెస్టుకు కామెంట్రీ చేసి 23 న భారత్ కు బయలుదేరి 24 న ఐపీఎల్ వేలానికి అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తుంది. రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదిలి పంజాబ్ హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.