Shubman Gill: గిల్‌తో సీరియల్ నటి పెళ్లి..? రూమర్లకు చెక్ పెట్టిన బ్యూటీ

Shubman Gill: గిల్‌తో సీరియల్ నటి పెళ్లి..? రూమర్లకు చెక్ పెట్టిన బ్యూటీ

టీమిండియా యువ టాలెంటెడ్ ఆటగాడు శుభమాన్ గిల్, టెలివిజన్ నటి రిధిమా పండిట్ ప్రేమ వ్యవహారం వస్తున్న పుకార్లు మరోసారి   తెరపైకి వచ్చింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు కొన్ని నెలల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య పెళ్లి జరుగుతుంది అనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సారా టెండుల్కర్ తో పాటుగా ఓ హీరోయిన్ తో గిల్ ఒకప్పుడు  రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు బలంగా వినిపించాయి. దీంతో  నటి రిధిమా పండిట్ తో ప్రేమ వ్యవహారం నిజమే అన్నట్టు నెటిజన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని రిధిమా పండిట్ ఓపెన్ గానే చెప్పేసింది. 

ఇటీవలి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మోడల్ తనకి గిల్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. "గిల్ గొప్ప ప్లేయర్ అని నాకు తెలుసు. అది మినహాయిస్తే అతని గురించి నాకు ఏమీ తెలియదు. ఒకవేళ గిల్ ను ఎప్పుడైనా కలిస్తే ఈ విష్యం గురించి చెప్పుకి నవ్వుకుంటాము. అతను చాలా అందంగా ఉంటాడు. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. తనకు నాకు వస్తున్న పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదు". అని రిద్ధిమా పండిట్ గిల్ తో వస్తున్న పెళ్లి రూమర్లకు చెక్ పెట్టింది. 

బహు హమారీ రజనీకాంత్.. బిగ్ బాస్ OTT.. ఖత్రోన్ కే ఖిలాడీ వంటి రియాల్టీ షో లో కనిపించి బాగా తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. వీటితో పాటు ఆమె పలు సీరియల్ లోనూ కనిపించింది. మరోవైపు గిల్ టీమిండియాలో మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భారత యువ జట్టుకు గిల్ సారధ్యం వహించాడు. ఈ సిరీస్ భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది. ప్రస్తుతం గిల్ శ్రీలంకతో జూలై 27 నుంచి జరగబోయే టీ20, వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్నాడు.