మల్క కొమరయ్యకు ఆర్ఐఈ  మద్దతు

మల్క కొమరయ్యకు ఆర్ఐఈ  మద్దతు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : బీజేపీ టీచర్స్‌‌‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌ మల్క కొమురయ్యకు రెసిడెన్షియల్‌‌‌‌ ఎడ్యుకేషనల్‌‌‌‌ ఇన్స్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్‌‌‌‌ సభ్యులు శనివారం కొమురయ్యను కలిసి మద్దతు పత్రం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌‌‌‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరసింహులు గౌడ్‌‌‌‌, గణేశ్‌‌‌‌ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి కొమురయ్య కృషి చేస్తారన్న నమ్మకంతోనే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

ఆయన విద్యావ్యవస్థలో మూడు దశాబ్దాలు పనిచేసినందున టీచర్ల సమస్యలపై అవగాహన ఉందన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తమ సమస్యలను మండలిలో ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.