చట్టంలో భద్రంగా విద్యా హక్కు

చట్టంలో భద్రంగా విద్యా హక్కు

విద్యను హక్కుగా మార్చాలని స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి డిమాండ్ లున్నా యి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి వివరించింది. దాంట్లో 6–14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొన్నది. అనేక ప్రయత్నాల తర్వాత 2009 సెప్టెం బర్‌ 3న ‘రైటు టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌‌‌‌’ వచ్చిం ది. ఇది 2010 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పేద విద్యార్థులు బడిబాట పట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది.చట్టం అమలు బాధ్యతను నాటి రాజీవ్‌ విద్యా మిషన్‌ (సమగ్ర శిక్షా అభియాన్‌ )కి అప్పగించారు. జమ్మూ కశ్మీర్‌ మినహా అన్ని రాష్ర్టాల్లో చట్టం అమలు జరుగుతోంది. బాల బాలికలు బడిలోనే ఉండాలనే నిబంధన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది. సర్కారు బడుల్లో వసతులు కూడా పెరిగాయి. విద్యార్థు ల నుంచి ఫీజులు లేకుండానే చదువు చెప్పడంతో పాటు ఆ విద్యార్థి బడికి వచ్చే విధంగా ఏర్పాట్ లు కూడా చేయాల్సి వచ్చింది.ఏ యస్సులోనైనాగానీ, టీసీతో సంబంధం లేకుండానే కోరుకున్న బడిలో అడ్మిషన్లు కల్పించాలని చట్టం చెబుతోంది.

అమలు కాని నిబంధనలు…

ఇంకా, మంచి ట్రైనింగ్‌ పొందిన టీచర్లు మాత్రమే విద్యార్థు లకు పాఠాలు చెప్పాలని, రికగ్నైజేషన్‌ లేని స్కూళ్లు ఉండరాదని, విద్యార్థు లకు ఎంట్రన్స్‌ నిర్వహించకూడదని ఈ చట్టం లో పొందుపర్చారు. స్కూల్‌ మేనేజ్మెం ట్ కమిటీలు (ఎస్‌‌‌‌ఎంసీ) చట్టం అమల్లో భాగంగానే ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ చట్టం పరిధిలోకి 6–-14 వయసులోపు బాలబాలికలు మాత్రమే వస్తారు. ప్రస్తుత సమాజంలో రెండు, మూడేళ్ల పిల్లలను నర్సరీలు మొదలుకొని కిండర్‌ గార్టెన్‌ స్కూళ్ల వరకు చేర్పించేస్తున్నారు. మరోపక్క 8వ తరగతి వరకే ఈ చట్టం వర్తిస్తుందనే నిబంధన ఉంది. దాన్ని 18 ఏళ్ల వరకూ పెంచాలనే డిమాండ్‌‌‌‌ ప్రజలు, అక్కడ మీషియన్ల నుంచి వస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లు పేద, వెనుకబడిన పిల్లలకు కేటాయించాలనే నిబంధన ఉంది. అయితే ఈ సీట్లకు ఫీజులు ప్రభుత్వం చెల్లిస ్తుందా లేక యాజమాన్యాలు ఉచితంగానే ఇవ్వాలనే దానిపై స్పష్టత లేదు. దీంతో ఈ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. విద్యార్థు లకు ప్రవేశపరీక్షలు నిర్వహించవద్దనే చెప్తునే మరోపక్క కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నవోదయ స్కూళ్లకు అవకాశమిచ్చారు. అయితే, మొదట్లో మన ఉమ్మడి రాష్ర్టం లో రెసిడెన్షియల్‌ స్కూళ్లలో లాటరీ పద్దతిలో సీట్లు కేటాయించి నా,ఆ తర్వాత గురుకులాలతో పాటు మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లకు ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నారు. దీన్ని సాకుగా చూపిస్తూ చాలా ప్రైవేటు స్కూళ్లు కూడా ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇలా నిర్వహించే ప్రైవేటు స్కూళ్లకు జరిమానా విధించాలని చట్టం చెబుతోంది. కానీ, రాష్ట్రం లో అనేక స్కూళ్లు ఎంట్రన్స్‌ నిర్వహిస్తున్నా యి

నిధులపై స్పష్టత లేదు…

చట్టం అమలుకు సంబంధించి నిధుల కేటాయింపులో ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ప్రస్తుతం ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ ద్వారా కేంద్రం 60–40 నిష్పత్తిలో రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తుంది. ఇవి ప్రత్యేకంగా ఈ చట్టం కోసమేనని ఎక్కడా చెప్పడం లేదు. కేవలం విద్యా భివృద్ధికోసం కేటాయిస్తున్నట్ లు చెబుతోంది. చట్టం అమలు, బాలల హక్కుల పరిరక్షణ కోసం ఉమ్మడి రాష్టం లో ఒక కమిటీ ఉన్నా, దానికి రైట్స్‌ ఇవ్వలేదు. సభ్యుల కాలపరిమితి ముగి యడంతో కొత్తగా ఎవ్వరినీ నియమించకపోవడంతో , అది ఇప్పుడు లేకుండా పోయింది. చట్టం లోని లోపాలు సవరించి , రైటు టు ఎడ్యు కేషన్‌ యాక్ట్‌‌‌‌ పకడ్బందీగా అమలు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది.