ప్రశ్నించే గొంతులెక్కడ?

ప్రశ్నించే గొంతులెక్కడ?

సమాజంలో ప్రశ్నిం చేతత్వం తగ్గిపోతోం ది. అన్యా యం జరిగినా సర్దుకు పోయే వైఖరి రోజురోజుకూ బలపడుతోం ది. ‘ ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ’ హక్కును దెబ్బతీయడానికి పాలకవర్గాలు ప్రయత్నించినా ఎవరూ గొం తెత్తడం లేదు. ఎవరికి వారు సేఫ్ జోన్ కు ప్రయారిటీ ఇస్తూ సైలెంట్ గా ఉండిపోతున్నారు.

ప్రశ్నించే గొంతులు మూగబోతున్నాయి . ఒక స్థాయి వరకు చైతన్యాన్ని చూపిన సమాజం క్రమేపీ నిస్తేజంగా మారుతోంది. అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తాలన్న స్పృహ మెల్లమెల్లగా కోల్పోతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం అహ్మదాబాద్‌ లోని హెచ్‌‌‌‌కే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేయడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుదెరువుకు ఆధారమైన కొలువులనే వదులుకోవడం ఇవాళ్టి రోజున చాలా పెద్ద విషయమే. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్‌‌‌‌ మేవానీని ఓ ఫంక్షన్‌‌‌‌కి కాలేజీ యాజమాన్యం ఆహ్వానించింది. తర్వాత ఏమైందో ఏమోకానీ, జిగ్నేశ్‌‌‌‌ ప్రసంగాన్ని వద్దనుకున్నారు. ఏకంగా కార్యక్రమాన్నే రద్దు చేశారు. జిగ్నేశ్‌‌‌‌ ఆ కాలేజీకి ఓల్డ్ స్టూడెంట్. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ షాతో పాటు వైస్ ప్రిన్సిపాల్ మోహన్ భాయ్ పర్మార్ కూడా రిజైన్ చేశారు. ‘రాత్రికి రాత్రి హీరో అవుదామని నేను రిజైన్ చేయలేదు. మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్ణయం ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌‌‌‌ప్రెషన్‌‌‌‌ని హరించివేయడమేనని ఫీలయ్యా . అందుకే ప్రిన్సిపాల్ పోస్టు నుంచి వైదొలగాను’ అన్నారు హేమంత్ కుమార్ షా. ఈ రాజీనామాలను మీడియా పెద్దగా పట్టించుకోలేదు కానీ, అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తేవారికి మాత్రం నైతిక స్థయిర్యం లభించినట్లయింది.

ఇదేనా కారణం!
జిగ్నేశ్ మేవాని కార్యక్రమాన్ని కాలేజీ యాజమాన్యం ఎందుకు రద్దు చేసిందో తెలుసుకోవడం పెద్దగా కష్టం కాదు. మేవాని సాధారణ ఎమ్మెల్యే కాడు. దేన్నయినా, ఎవరినైనా ప్రశ్నించే తత్వం ఉన్నవాడు. ఇప్పటికే అనేక అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మేవానీ తమ కాలేజీలోకూడా గట్టిగా గొంతు వినిపిస్తే తమకు చుట్టుకుంటాయని మేనేజిమెంట్‌‌‌‌ భయపడింది. ఆ భయంతోనే ఏకంగా ప్రోగ్రాం రద్దు చేసిందన్న విషయం బహిరంగ రహస్యమే.

అన్నా స్ఫూర్తి ఏమైంది?
అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే 2011లో ఉద్యమించినప్పుడు కొండంత అండగా నిలిచిన వ్యక్తులు, సంస్థలు ఈసారి సైలెంట్ అయిపోయాయి. అవినీతి ఇండియన్‌‌‌‌ సొసైటీలో భాగమైపోయిందని రాజీ పడ్డారా? లేక ఉద్యమ స్ఫూర్తి కోల్పోయారా అనేది అర్థం కాని విషయం.

సేఫ్ జోన్‌‌‌‌కే ప్రయారిటీ
ప్రభుత్వాలు తీసుకునే అస్తవ్యస్త నిర్ణయాలపై ఎవరూ ప్రశ్నించలేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అయితే ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు సైలెంట్‌‌‌‌గా ఉండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రశ్నించడంతో వచ్చే ఇబ్బందులను, కష్టాలను భరించే ఓపిక ఎవరికీ లేకుండా పోతోంది. చాలా మంది సేఫ్ జోన్‌‌‌‌లో ఉండటానికి ఇష్టపడుతున్నారు .