RIL బోర్డు డైరెక్టర్లుగా ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ

RIL బోర్డు డైరెక్టర్లుగా ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్లుగా ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలను నియమించారు. ఈమేరకు రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముఖేష్ అంబానీ సోమవారం (2023 ఆగస్టు 28)న ప్రకటించారు.  మరోవైపు రిల్ బోర్టు డైరెక్టర్ల బోర్డు నుంచి నీతా అంబానీ రాజీనామాను డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. రిలయన్స్ ఫౌండేషన్ పై దృష్టి సారించాలని నీతా అంబానీ నిర్ణయించుకున్నారు. 

ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ గత కొన్ని సంవత్సరాలుగా రిటైల్, డిజిటల్ సేవలు, ఇంధనం ,మెటీరియల్ బిజినెస్ లతో సహా RIL కీలక వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. RIL కీలక అనుబంధ సంస్థల బోర్డులలో కూడా సేవలందిస్తారు. RIL బోర్డ్‌లో వారి నియామకం RIL కొత్త ఆలోచనలతో  ముందుకు సాగుతుందని" అని బోర్డు అభిప్రాయపడింది.