రిలయన్స్ మార్కెట్ క్యాప్ మరో రూ.8.3 లక్షల కోట్లు పెరుగుతుంది

రిలయన్స్ మార్కెట్ క్యాప్ మరో రూ.8.3 లక్షల కోట్లు పెరుగుతుంది

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మరో 100 బిలియన్ డాలర్లు (రూ.8.3 లక్షల కోట్లు) పెరగగలదని మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ పేర్కొంది. కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి రెవెన్యూ పెరుగుతుందని, ఫలితంగా రిలయన్స్ వాల్యుయేషన్ కొన్ని రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి టెలికం వరకు వివిధ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఉన్న రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్ గత 30 ఏళ్లలో ఇన్వెస్టర్ల సంపదను మూడు రెట్లకు పైగా పెంచింది.  ప్రతీ దశాబ్దంలో కంపెనీ మార్కెట్ క్యాప్ 60 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీ షేర్లు సోమవారం రూ.3,123 దగ్గర ముగిశాయి.