ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్ల హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం జట్టులో నలుగురు విడీస్ ఆటగాళ్లే ఉండాలి. వీరు మ్యాచ్ పై ఎంతో ప్రభావం చూపిస్తారు. కొన్ని జట్లలో నలుగురు విదేశీ ఆటగాళ్ల కారణంగా స్టార్ ప్లేయర్లయినా బెంచ్ కు పరిమితం కావాల్సి వస్తుంది. అయితే నేడు (మే 19) ఐపీఎల్ లో జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం దీనికి భిన్నం. పంజాబ్ కింగ్స్ కేవలం ఒక్క విదేశీ ఆటగాడితోనే బరిలోకి దిగింది.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ విదేశీ ఆటగాళ్లల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు రూసోకు మాత్రమే తుది జట్టులో దక్కింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు కేవలం ఒకే విదేశీ ఆటగాడితో బరిలోకి దిగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు సామ్ కరణ్, జానీ బెయిర్ స్టో పాకిస్థాన్ తో సిరీస్ ఉండడంతో స్వదేశానికి వెళ్లిపోయారు. మరోవైపు రబడా సైతం దక్షిణాఫ్రికా చేరుకున్నాడు.
పంజాబ్ జట్టులో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్ తో పాటు ఆసీస్ యువ బౌలర్ నాథన్ ఎల్లిస్ ఉన్నారు. అయితే వీరిద్దరినీ పక్కనపెట్టి భారత ఆటగాళ్లపై నమ్మకం ఉంచారు. ఒకే విదేశీ ఆటగాడితో బరిలోకి దిగినా పంజాబ్ ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ప్రభసిమ్రాన్ సింగ్(71; 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకం బాదగా.. అథర్వ తైడే(46; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిలీ రోసో(49; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్ శర్మ (32 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
Rilee Rossouw is the only overseas player in the Punjab Kings' team 🤯
— SportsTiger (@The_SportsTiger) May 19, 2024
📷: IPL#PBKS #IPL2024 #TATAIPL2024 #RileeRossouw #PunjabKings #SaddaPunjab pic.twitter.com/FXX2jSB1SO