ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ హాస్పిటల్​లో..అరుదైన క్యాన్సర్ ఆపరేషన్లు : డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ 

ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ హాస్పిటల్​లో..అరుదైన క్యాన్సర్ ఆపరేషన్లు : డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ 
  • వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో అరుదైన క్యాన్సర్ ఆపరేషన్లు సక్సెస్​ఫుల్​గా చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. బుధవారం హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్​కు చెందిన ముగ్గురికి కడుపులో క్యాన్సర్, మరొకరికి క్లోమం క్యాన్సర్ ఆపరేషన్లు చేశామని చెప్పారు.

ఇటీవల నలుగురికి సర్జరీ చేశామని, వారు పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ఈ సర్జరీలకు ప్రైవేట్ హాస్పిటల్స్​లో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని పేర్కొ న్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల క్యాన్సర్లకు ఆపరేషన్లు చేస్తున్నామని,  ఇప్పటివరకు దాదాపు 400 ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. కిడ్నీ, పీడియాట్రిక్, న్యూరో సర్జరీలు జరుగుతున్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదారబాద్, నాగ్​పూర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ స్థాయిలో చికిత్స అందుతున్నాయని తెలిపారు.