
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: రిమ్స్ సూపర్‌స్పెషాలిటీ పీడియాట్రిక్ విభాగంలో పీడియాట్రిక్సర్జన్ దేవిదాస్అరుదైన సర్జరీ చేశారని హాస్పిటల్ డైరెక్టర్ జైసింగ్‌రాథోడ్ తెలిపారు. శనివారం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాప అండాశయ క్యాన్సర్ తో బాధపడుతూ హాస్పిటల్లో చేరిందన్నారు. డాక్టర్దేవిదాస్ ఆమెకు విజయవంతంగా సర్జరీ చేశారని పేర్కొన్నారు. రిమ్స్ లో నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నామని, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో లేని సదుపాయాలు ఇక్కడున్నాయని చెప్పారు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం హెర్నియా, టాన్సిలెక్టమీ తదితర సర్జరీలు చేయించుకొని, కోలుకున్న పిల్లలను డిశ్చార్జ్ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, యూరాలజీ వైద్య నిపుణుడు కుమ్మరి కార్తీక్ పటేల్, గ్యాస్ట్రాలజీ వైద్య నిపుణుడు వివేక్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.