రిమ్స్​ కార్మికులకు వేతనాలు చెల్లించాలి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: తమకు వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ​చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్​లోని రిమ్స్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు శనివారం ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ ​డీఎంఈ సర్క్యులర్​ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. జీతాలు మంజూరు చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్​ వెల్లడించారు. ధర్నాలో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.