IPL 2025: KKR కాదంటే ఆ జట్టు తరపున ఆడాలని ఉంది: రింకూ సింగ్

IPL 2025: KKR కాదంటే ఆ జట్టు తరపున ఆడాలని ఉంది: రింకూ సింగ్

కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున సంచలన బ్యాటింగ్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రింకూ సింగ్ కు ఈ సారి ఆ జట్టు తరపున ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మెగా వేలం జరగనుండడంతో నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేకేఆర్ తరపున అయ్యర్, నరైన్, రస్సెల్ రిటైన్ చేసుకోవడం దాదాపుగా ఖాయమైంది. మిగిలిన ఒక్క స్థానం కోసం పోటీ నెలకొంది. ఈ ఒక్క స్థానం కోసం రింకూను తీసుకోవడం అనుమానంగా మారింది. ఒకవేళ కేకేఆర్ తనను రిటైన్ చేయకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. 

స్పోర్ట్స్ తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ ఉండడమే ఇందుకు కారణమని తన మనసులో మాటను బయట పెట్టాడు. దీంతో రింకూ సింగ్ బెంగళూరు జట్టులోకి రావాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కోహ్లీ, రింకు సింగ్ కు మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024 ఐపీఎల్ సీజన్ సందర్భంగా కోహ్లీ తన బ్యాట్ ను రింకూకు గిఫ్ట్ గా ఇచ్చాడు. 

2018లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున రింకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గత ఐదేళ్ల పాటు అదే టీమ్ తరుపున ఆడుతూ వస్తున్నాడు. 20222 ఐపీఎల్ లోగాయం కారణంగా అతను ఆడలేకపోయాడు. 2023 ఐపీఎల్ కు ముందు జరిగిన వేలంలో 55 లక్షలకు కొనుగోలు చేసి తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్ లో రింకూ నిరాశపరిచాడు. 11 ఇన్నింగ్స్ ల్లో కేవలం 168 పరుగులు మాత్రమే చేశాడు.